భారత మార్కెట్లో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ 3 ….ఫీచర్స్ ఏంటో తెలుసా?

Technology

యూకేకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ నుండి విడుదల చేసిన నథింగ్ ఫోన్ 3 భారతదేశంలో అఫీషియల్ గా లాంచ్ అయింది. అత్యాధునికమైన స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 చిప్‌సెట్తో వచ్చిన ఈ ఫోన్‌కు 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. ఫోన్ వెనుక భాగంలో కొత్తగా గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనే ప్రత్యేకమైన LED సిస్టమ్‌ను అందించారు. ఇది నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్, టైం తదితర విషయాలను డిస్ప్లే చేస్తుంది.నథింగ్ ఫోన్ 3 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 79,999 కి దొరుకుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ అయిన 16GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,999కి లభిస్తుంది.

ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే… ఈ ఫోన్ వైట్ మరియు బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. జూలై 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, విజయ్ సేల్స్, క్రోమా మరియు ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ కు ఫ్రీ బుకింగ్ ఆప్షన్ కూడా ఉండగా ఇప్పటికే ప్రారంభమైంది. ప్రత్యేక లాంచ్ ఆఫర్‌గా, ప్రీ-బుక్ చేసే వినియోగదారులకు నథింగ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఉచితంగా లభించనున్నాయి.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు:

నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా రూపొందించిన నథింగ్ OS 3.5 పై రన్ అవుతుంది. దీనికి 5 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్లు మరియు 7 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని నథింగ్ ప్రకటించింది.

ఇక డిస్ప్లే విషయానికి వస్తే…6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో ఈ మొబైల్ వస్తుంది. 1260 x 2800 పిక్సెల్స్ రిజల్యూషన్, 92.89% స్క్రీన్ టు బాడీ రేషియో, 460ppiపిక్సెల్ డెన్సిటీ ఇస్తున్నారు. HDR10+, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కూడా ఇందులో ఉన్నాయి. 2160Hz PWM డిమ్మింగ్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఈ ఫోన్ ముందు భాగంలో గోరిల్లా గ్లాస్ 7i, వెనుక భాగంలో గోరిల్లా గ్లాస్ విక్టస్ ఉంటుంది.

ఈ ఫోన్ Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. యూజర్ కి బెస్ట్ కెమెరా ఫీచర్స్ అందించే విధంగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (OIS తో), 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా (3x జూమ్, OIS తో) మరియు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాటింగ్ ఇష్టపడే వారి కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

స్టోరేజ్ పరంగా చూస్తే 16GB RAM ,512GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లు అయితే 5G, Bluetooth 6, NFC, GPS, A-GPS, GLONASS, GALILEO, QZSS, NavIC, Wi-Fi 7 వంటి అంశాలు ఉన్నాయి. 360° యాంటెన్నా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా వస్తున్నాయి. మొబైల్ నీటిలో పడిన, డస్ట్ లో పడిన ఎటువంటి ఇబ్బంది లేకుండా IP68 రేటెడ్ వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది.

ఇక బ్యాటరీ బ్యాక్ అప్ చూస్తే. 5500mAh బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యేలా…65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. 1% నుంచి 100% వరకు 54 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. దీనికి అదనంగా 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్ 160.60 x 75.59 x 8.99mm డైమెన్షన్స్ తో , 218 గ్రాముల బరువుతో వస్తుంది. బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా రెండు హై-డెఫినిషన్ మైక్రోఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి.

పాత నథింగ్ ఫోన్లలో ఉన్న గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను తొలగించి, ఇప్పుడు గ్లిఫ్ మ్యాట్రిక్స్ అనే చిన్న సర్కులర్ LED ప్యానెల్ను వెనుక భాగంలో అందించారు. ఇది 489 మైక్రో LED లతో రూపొందించబడింది. ఛార్జింగ్, కాల్ అలర్ట్లు, టైమర్ వంటి ఫీచర్లకు ఇది ఉపయోగపడుతుంది.

புதுப்புது தொழில்நுட்ப செய்திகள், அறிமுகமாகும் கருவிகள் பற்றிய விமர்சனங்கள் எல்லாவற்றையும் உடனுக்குடன் தமிழில் பெற பேஸ்புக் மற்றும் ட்விட்டர் NDTV Tamilஐ பின் தொடருங்கள்.

Join the best Tamil Chat Room to connect instantly with Tamil friends worldwide. Chat, call, share, and enjoy live Tamil FM , Start Chatting Now!

Social Media

Join with our Social Media pages to get immediate updates!

Copyright © 2025. Startamilchat.in All rights reserved.